Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఇటు సినీ రంగం, అటు పొలిటికల్ రంగానికి సంబంధించిన ప్రత్యర్ధులపై బాణాలు విసురుతూనే ఉంటారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉంటారు. మా ఎలక్షన్స్ సమయం నుండి మంచు వర్సెస్ నాగబాబు అన్న చందాన మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవంలో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. నాగబాబుపై ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు వేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తన ఫ్యామిలీని నాగబాబు ఎలా టార్గెట్ చేశారో.. ట్రోలింగ్ చేయిస్తున్నారో తెలియజేస్తూ.. హయ్యర్ పర్పస్ సూత్రంతో నాగబాబుకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మనోజ్. ఆ తర్వాత నాగబాబు కూడా హయ్యర్ పర్పస్ అనే పదాన్ని పదే పదే వాడుతూ చురకలంటించారు. అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య వివాదం నడుస్తూనే ఉన్న క్రమంలో ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ లేదా కేజీయఫ్.. రెండింటిలో ఏది బాగుంది.. అంటూ ప్రశ్న సంధించాడు. దీనికి నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ రెండూ కాదు.. ఈ మధ్యే ఒక లెజెండరీ గ్రాఫిక్ సినిమా వచ్చింది.. అది బాగుందని.. అన్నారు. అది వాస్తవానికి మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమానే అని నాగబాబు ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇచ్చారు.
ఇక నాగబాబు ఆ కామెంట్స్ చేయడంతో ఆ సినిమా ఏంటో ఈజీగానే గెస్ చేశారు. అది మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమానే అని అందరూ అన్నారు. గతంలో కూడా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండయాపై కూడా నాగబాబు సెటైర్స్ వేసిన విషయం తెలిసిందే. ఇక మంచు విష్ణుకి విరోధిగా మారిన హెయిర్ స్టైలిస్ట్‌ని కూడా నాగబాబు దగ్గరకు తీసుకున్న విషయం విదితమే. నాగ శ్రీను చాలా కాలంగా హీరో మంచు విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్నాడు. కాగా మంచు విష్ణు తన ఆఫీస్ లోని విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని నాగ శ్రీను దొంగిలించాడు అంటూ కేసు పెట్టాడు. మంచు విష్ణు ఆరోపణలు ఖండించిన నాగ శ్రీను.. కులం పేరుతో దుర్భాషలాడటం, వేధించడంతో ఉద్యోగం మానేశాను అని అన్నాడు. అప్పుడు నాగబాబు అతడిని ఇంటికి పిలిచి 50 వేల రూపాయలు సహాయం చేశారు. అయితే నాగబాబు మళ్లీ మంచు ఫ్యామిలీపై సెటైర్స్ వేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…