Saiee Manjrekar : మహేష్ మంజ్రేకర్ ముద్దులు కూతురు సాయి మంజ్రేకర్ గని సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఏప్రిల్ 22న గని ఆహాలో రిలీజ్ అయింది. తెలుగు ఓటీటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ నిడివి మరో 10 నిమిషాలకు పైగా పెరిగింది. అయితే ఈ సినిమా హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఇప్పుడు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తోంది. ఈమె చేస్తున్న ఫొటోషూట్స్‌కు మతులు పోతున్నాయి.
కాగా సాయి మంజ్రేకర్ లవ్‌లో పడిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ కుమారుడు సుభాన్ నదియావాలాతో లవ్‌లో ఉందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇటీవల దీనిపై స్పందించిన హీరోయిన్ అవన్నీ అసత్య ప్రచారాలుగా కొట్టిపారేసింది. తామిద్దరం చిన్ననాటినుంచే బెస్ట్‌ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే తన మీద పుకార్లు పుట్టించడం కామన్ అయిపోయిందన్న సాయి మంజ్రేకర్.. తనేంటో తన కుటుంబానికి, స్నేహితులకు తెలుసని చెప్పింది.
సాయి మంజ్రేకర్‌ని తెలుగు, హిందీ భాషలకు సంబంధించిన సినిమాల కోసం పరిశీలిస్తున్నారు. ఈ అమ్మడు తాజాగా ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటోషూట్ చేసింది. ఇందులో సాయి మంజ్రేకర్ బోల్డ్ లుక్‌లో కనిపించింది. ఇది చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ అవతారంలో కనిపించి నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేసింది. త్వరలో ఈ అమ్మడు మేజర్ సినిమాతో పలకరించనుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…