Naga Chaithanya : నాగచైతన్య థాంక్యూ రిలీజ్ ఎప్పుడంటే ?

September 30, 2021 2:58 PM

Naga Chaithanya : ప్రస్తుతం నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న చిత్రబృందం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావిస్తుస్తోంది.

Naga Chaithanya : నాగచైతన్య థాంక్యూ రిలీజ్ ఎప్పుడంటే ?
Naga Chaithanya

ఈ చిత్రాన్ని డిసెంబర్ లోనే విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నప్పటికీ జనవరిలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు విడుదల కాబోతోంది. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

విక్రమ్ కుమార్ ఎంతో వైవిధ్యమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారని, గతంలో అక్కినేని కుటుంబంతో కలిసి మనం సినిమాను తెరకెక్కించిన తర్వాత తనకు ఏ విధమైనటువంటి హిట్ లేదని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ఇంతటి వైవిధ్యమైన కథను విక్రమ్ చేయలేదని, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. థాంక్యూ సినిమాలో నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now