Naga Chaithanya : అక్కినేని కుటుంబంలో ఈ తరం వారసులు నాగచైతన్య, అఖిల్ అని అందరికీ తెలుసు. నాగచైతన్య తమ్ముడు అఖిల్. అయితే బయటి ప్రపంచానికి తెలిసింది.. నాగచైతన్యకు ఉన్న తమ్ముడు అఖిల్ గురించే. వాస్తవానికి చైతూకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడట. ఇదేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే విషయం ఏమిటంటే..
నాగచైతన్యకు అఖిల్ కాకుండా ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. దీని గురించి అప్పుడప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే చైతూకు అఖిల్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడట.
నాగార్జున ముందుగా చైతూ అమ్మ లక్ష్మిని వివాహం చేసుకున్నారు. తరువాత కొంత కాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అయితే లక్ష్మి చెన్నైలో స్థిర పడింది. తరువాత ఆమె చెన్నైలో ఉన్న బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్‌ని పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల వరకు చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడే తండ్రి దగ్గరే ఉన్నాడు. కానీ చైతూ తరచూ తల్లి దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. అతని ఆలన పాలనను నాగార్జున, లక్ష్మిలు చూసుకునేవారు.
ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అన్నమాటే కానీ.. ఎప్పుడు వేడుకలు జరిగినా పాల్గొనేవారు. రామానాయుడు, అక్కినేని కుటుంబాలు కలసి మెలసి ఉండేవి. ఇక లక్ష్మికి, విజయరాఘవన్‌కు ఒక కుమారుడు న్నాడు. అతనే నాగచైతన్య రెండో తమ్ముడు. అతని గురించి చాలా మందికి తెలియదు. వారు అంతగా సీక్రెట్ మెయింటెయిన్ చేశారు. కొన్నేళ్ల కిందటే లక్ష్మి, శరత్‌ల కుమారుడి పెళ్లి చెన్నైలో జరిగిందట. ఈ వేడుకకు చైతూ, సమంత కూడా వెళ్లారు.
ఇక నాగచైతన్య రెండో తమ్ముడి పెళ్లి ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే లక్ష్మి అంటే సమంతకు విపరీతమైన ప్రేమ, గౌరవం. అందుకనే సమంత, చైతూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా సింపుల్‌గా ఆ నిర్ణయం చెప్పేశారు. ఏదేమైనా అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్నమాట. ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…