Naga Chaithanya : నాగ‌చైత‌న్య‌కు అఖిల్ కాకుండా ఇంకో త‌మ్ముడు కూడా ఉన్నాడు.. తెలుసా..?

November 23, 2021 1:02 PM

Naga Chaithanya : అక్కినేని కుటుంబంలో ఈ త‌రం వార‌సులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ అని అంద‌రికీ తెలుసు. నాగ‌చైత‌న్య త‌మ్ముడు అఖిల్‌. అయితే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది.. నాగ‌చైత‌న్య‌కు ఉన్న త‌మ్ముడు అఖిల్ గురించే. వాస్త‌వానికి చైతూకు ఇంకో త‌మ్ముడు కూడా ఉన్నాడ‌ట‌. ఇదేంటి.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.. అయితే విష‌యం ఏమిటంటే..

Naga Chaithanya has another brother in addition to akhil

నాగ‌చైత‌న్య‌కు అఖిల్ కాకుండా ఇంకో త‌మ్ముడు కూడా ఉన్నాడ‌ని ఎప్ప‌టి నుంచో చ‌ర్చ న‌డుస్తోంది. దీని గురించి అప్పుడప్పుడు వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే చైతూకు అఖిల్ కాకుండా ఇంకో త‌మ్ముడు ఉన్నాడ‌ట‌.

నాగార్జున ముందుగా చైతూ అమ్మ ల‌క్ష్మిని వివాహం చేసుకున్నారు. త‌రువాత కొంత కాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అయితే ల‌క్ష్మి చెన్నైలో స్థిర ప‌డింది. త‌రువాత ఆమె చెన్నైలో ఉన్న బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్‌ని పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల వరకు చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడే తండ్రి దగ్గరే ఉన్నాడు. కానీ చైతూ త‌ర‌చూ త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లి వ‌స్తుండేవాడు. అత‌ని ఆల‌న పాల‌నను నాగార్జున‌, ల‌క్ష్మిలు చూసుకునేవారు.

ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు అన్న‌మాటే కానీ.. ఎప్పుడు వేడుక‌లు జ‌రిగినా పాల్గొనేవారు. రామానాయుడు, అక్కినేని కుటుంబాలు క‌ల‌సి మెల‌సి ఉండేవి. ఇక ల‌క్ష్మికి, విజ‌య‌రాఘ‌వ‌న్‌కు ఒక కుమారుడు న్నాడు. అత‌నే నాగ‌చైత‌న్య రెండో త‌మ్ముడు. అత‌ని గురించి చాలా మందికి తెలియ‌దు. వారు అంత‌గా సీక్రెట్ మెయింటెయిన్ చేశారు. కొన్నేళ్ల కింద‌టే ల‌క్ష్మి, శ‌ర‌త్‌ల కుమారుడి పెళ్లి చెన్నైలో జ‌రిగింద‌ట‌. ఈ వేడుక‌కు చైతూ, స‌మంత కూడా వెళ్లారు.

ఇక నాగ‌చైత‌న్య రెండో త‌మ్ముడి పెళ్లి ఫొటోలు కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మి అంటే స‌మంత‌కు విప‌రీత‌మైన ప్రేమ‌, గౌర‌వం. అందుక‌నే స‌మంత‌, చైతూ విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా సింపుల్‌గా ఆ నిర్ణ‌యం చెప్పేశారు. ఏదేమైనా అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్నమాట. ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now