Samantha : నాగచైతన్యతో ఉన్న ఆ ఒక్క జ్ఞాపకాన్ని కూడా చెరిపివేసిన సమంత ?

March 11, 2022 11:17 AM

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొంతకాలం నుంచి సమంత ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇక సమంత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం కూడా సంచలనంగా మారింది. విడాకుల తర్వాత నాగచైతన్య కన్నా సమంత ఎంతో హైలెట్ అయిందని చెప్పాలి. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తనకు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Samantha returned her wedding saree to Naga Chaitanya
Samantha

ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఎలాంటి వస్తువులు తనదగ్గర ఉండకూడదని భావించిందని సమంత అతను ఇచ్చిన వస్తువులను కూడా తిరిగి వెనక్కి పంపించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది.

సమంత నాగ చైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న పెళ్లి చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మ అమ్మ చీర కావడం విశేషం. ఈ విధంగా సమంత తన పెళ్లి కోసం అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు గౌరవ సూచకంగా ఈ చీర కట్టుకుంది. ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేక పోవడంతో తిరిగి తన చీరను వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now