Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. నాగ చైతన్య గత కొంతకాలంగా సినిమాల్లో వేగం పెంచాడు. వరుసగా సినిమాలు విడుదల అవుతుండడంతో అనేక ఇంటర్వ్యూలలో చైతూ పర్సనల్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు నాగ చైతన్య.
ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొన్నాడు. అందులో హోస్ట్ తనకు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే పోలీసులకు దొరికిపోయాను అంటూ హోస్ట్ చెప్పుకొచ్చాడు. దీనికి కొనసాగింపుగా నాగ చైతన్య కూడా తనకు జరిగిన ఓ స్వీట్ మెమొరీని చెప్పాడు.
అలాంటి ఘటన నాకు కూడా జరిగింది. కాలేజ్ రోజుల్లో నా కారు బ్యాక్ సీట్ లో నా గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాను. అప్పుడు నాకు అది తెలిసే జరిగింది. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సీక్రెట్ నెట్టింట వైరల్ గా మారింది.
మొత్తానికి నాగ చైతన్య మాత్రం చిలిపి పనులు బాగానే చేసినట్టు తెలుస్తోంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ తాత, తండ్రి, తనయుడు ముగ్గురూ నవ మన్మథులే అని నిరూపించుకున్నారు. ఇక నాగ చైతన్య తన థాంక్యూ విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కామన్.. మున్ముందు మనం ఫెయిల్యూర్స్‌ను తగ్గించుకుంటూ వెళ్లాలి.. అదే జీవితం అని చెప్పుకొచ్చాడు చైతూ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…