Naga Chaitanya : కారులో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయిన నాగ చైతన్య..!

August 15, 2022 7:50 PM

Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. నాగ చైతన్య గత కొంతకాలంగా సినిమాల్లో వేగం పెంచాడు. వరుసగా సినిమాలు విడుదల అవుతుండడంతో అనేక ఇంటర్వ్యూల‌లో చైతూ పర్సనల్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో ఎన్నో ఆసక్తికరమైన విషయాల‌ను మీడియాతో పంచుకున్నాడు నాగ చైతన్య.

ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొన్నాడు. అందులో హోస్ట్ తనకు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే పోలీసులకు దొరికిపోయాను అంటూ హోస్ట్ చెప్పుకొచ్చాడు. దీనికి కొనసాగింపుగా నాగ చైతన్య కూడా తనకు జరిగిన ఓ స్వీట్ మెమొరీని చెప్పాడు.

Naga Chaitanya said he was caught by police in his college days
Naga Chaitanya

అలాంటి ఘటన నాకు కూడా జరిగింది. కాలేజ్ రోజుల్లో నా కారు బ్యాక్ సీట్ లో నా గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాను. అప్పుడు నాకు అది తెలిసే జరిగింది. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సీక్రెట్ నెట్టింట వైరల్ గా మారింది.

మొత్తానికి నాగ చైతన్య మాత్రం చిలిపి పనులు బాగానే చేసినట్టు తెలుస్తోంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ తాత, తండ్రి, తనయుడు ముగ్గురూ నవ మన్మథులే అని నిరూపించుకున్నారు. ఇక నాగ చైతన్య తన థాంక్యూ విషయంలో జరిగిన తప్పులను ఒప్పుకున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కామన్.. మున్ముందు మనం ఫెయిల్యూర్స్‌ను తగ్గించుకుంటూ వెళ్లాలి.. అదే జీవితం అని చెప్పుకొచ్చాడు చైతూ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now