Naga Chaitanya : త‌న‌కు ఎంత‌గానో ఇష్ట‌మైన ఇంటిని.. స‌మంత‌కే ఇచ్చేసిన నాగ‌చైత‌న్య‌..?

Naga Chaitanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య గ‌తేడాది అక్టోబ‌ర్ మొద‌టి వారంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడైతే స‌మంత త‌న పేరు నుంచి అక్కినేని తొల‌గించి కేవ‌లం ఎస్ అన్న అక్ష‌రాన్ని ఉంచిందో.. అప్ప‌టి నుంచే వీరు విడాకులు తీసుకోబోతున్నార‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. త‌రువాత నెల రోజుల‌కే అవే వార్త‌లు నిజ‌మ‌య్యాయి. దీంతో వీరి విడాకుల‌పై అనేక మంది స్పందించారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. దీంతో ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం లేకుండానే మిగిలిపోయింది.

అయితే ఈ మ‌ధ్యే సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్.. సమంత‌, చైత‌న్య జంట‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను అప్ప‌ట్లో గ‌చ్చిబౌలి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో మూడు అపార్ట్‌మెంట్ల‌ను కట్టించాన‌ని, త‌న కుటుంబ స‌భ్యుల కోసం వాటిని క‌ట్టిస్తే చైత‌న్య వాటిల్లో ఒక‌టి త‌న‌కు కావాల‌ని అడిగాడ‌ని, అయితే త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన అపార్ట్‌మెంట్ల‌ని వాటిని ఇవ్వ‌న‌ని చెప్పాన‌ని.. కానీ కొద్ది రోజుల‌కు నాగార్జున కాల్ చేసి అడ‌గ‌డంతో కాద‌న‌లేక‌పోయాన‌ని.. ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. అప్ప‌టి నుంచి చైత‌న్య అదే అపార్ట్‌మెంట్‌లో ఒంట‌రిగా ఉండేవాడ‌ని అన్నారు. త‌రువాత స‌మంత‌తో క‌ల‌సి నివ‌సించ‌డం మొద‌లు పెట్టాడ‌ని తెలిపారు.

Naga Chaitanya

అయితే వాస్త‌వానికి ఈ ఇద్ద‌రూ విడిపోయిన త‌రువాత స‌మంత ఆ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వేరే చోట‌కు మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డంతో ముంబైలో ప్ర‌స్తుతానికి ఓ ఇంటిని రెంట్‌కు తీసుకుని స‌మంత ఉంటోంది. ఇక చైతూ విడాకుల అనంత‌రం కొంత‌కాలం పాటు హోట‌ల్‌లో రూమ్‌ను తీసుకుని ప్ర‌త్యేకంగా ఉన్నాడు. కానీ త‌రువాత ఇంకో ఇంటికి మారిపోయినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే త‌మ అపార్ట్‌మెంట్ ఖాళీగానే ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఆ అపార్ట్‌మెంట్ ను చైతూ స‌మంత‌కే ఇచ్చేశాడ‌ట‌. కానీ అందులో ఆమె ఉండేందుకు స‌సేమిరా అంద‌ట‌. దీంతో దాన్ని చైతూ కూడా అలాగే వదిలేసి వేరే చోట‌కు వెళ్లిపోయాడు. ఇక ఆ అపార్ట్‌మెంట్‌ను తాను వాడుకోన‌ని.. స‌మంత‌కే ఇచ్చేశాన‌ని చైతూ తెలిపాడ‌ట‌. దీంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

అయితే భ‌విష్య‌త్తులో ఈ జంట మ‌ళ్లీ క‌లిసే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో చైతూ ఆ అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టిన‌ట్లు కూడా గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత దాని గురించి అప్‌డేట్ లేదు. మ‌రి వీరి భ‌విష్య‌త్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM