Naga Chaitanya : వాట్‌.. నాగ‌చైత‌న్య‌కు ఆ వ్యాధి ఉందా.. ఇన్నాళ్లూ చెప్ప‌లేదే..?

July 10, 2022 12:41 PM

Naga Chaitanya : తెలుగు సినీ ప్రేక్ష‌కులకు అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న జోష్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అయితే తొలి చిత్ర‌మే ఫ్లాప్ అయింది. కానీ ఈయ‌న చేసిన ఏం మాయ చేశావె సినిమా ఈయ‌న‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. న‌టుడిగా ఈయ‌న త‌నను తాను నిరూపించుకున్న సినిమా ఇది. ఆ త‌రువాత కూడా అనే చిత్రాలు చేశాడు. కానీ కొన్ని మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే స‌మంత‌ను ప్రేమించ‌డం.. పెళ్లి చేసుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక వీరు విడాకులు కూడా తీసుకున్నారు. త‌రువాత ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా మారిపోయారు.

కాగా చైత‌న్య న‌టించిన గ‌త రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల ద్వారా చైతూ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా న‌టించిన థాంక్ యూ అనే చిత్రం ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులో చైతూకు జోడీగా రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. దీనికి విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇందులోని డైలాగ్స్ చైతూ నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. దీంతో సమంత‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకే ఆ డైలాగ్‌ల‌ను పెట్టార‌ని అంటున్నారు.

Naga Chaitanya has eye sight that is why he wears glasses
Naga Chaitanya

అయితే ఇటీవ‌లే చైతూకు, శోభిత ధూళిపాళ‌కు మ‌ధ్య లవ్ ట్రాక్ న‌డుస్తుంద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని చైతూ పీఆర్ టీమ్‌తోపాటు శోభిత కూడా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. దీంతో ఈ ఇద్ద‌రిపై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లు అయింది. అయితే రీసెంట్‌గా థాంక్ యూ చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రాశీ ఖన్నా చైతూతో క‌లిసి అనేక విష‌యాల‌ను షేర్ చేసింది. చైతూ, తాను సినిమాల గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటామ‌ని, ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకుంటామ‌ని చెప్పింది. ఇక చైత‌న్య వ‌ద్ద ఖ‌రీదైన కార్లు ఉన్నాయ‌ని.. అలాగే చైత‌న్యకు సైట్ ఉంద‌ని.. అందువ‌ల్లే అత‌ను ఎంతోకాలం నుంచి అద్దాల‌ను వాడుతున్నాడ‌ని తెలిపింది. కానీ చైత‌న్య స్టైల్ కోసం సినిమాల్లో అద్దాల‌ను ధ‌రిస్తుంటాడ‌ని చాలా మంది ఇప్ప‌టికీ న‌మ్ముతార‌ని.. అస‌లు విష‌యం అది కాద‌ని.. ఆయ‌న‌కు సైట్ ఉంద‌ని.. రాశీ ఖన్నా తెలియ‌జేసింది. దీంతో ఈ విష‌యం తెలిసిన నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment