Naga Chaitanya : మౌనంగా ఉంటున్న నాగ‌చైతన్య‌.. కార‌ణం ఏమిటి ?

April 28, 2022 1:48 PM

Naga Chaitanya : అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య స్వీట్ అండ్ క్యూట్ ప‌ర్స‌న్ అనే విష‌యం తెలిసిందే. ఇత‌గాడు స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా 2009లో ఏ మాయ చేశావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులుగా వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరీ చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోవ‌డంతో ఈ జంట‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఈ జంట‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రూ మురిసిపోయారు. వీరు విడిపోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు.

Naga Chaitanya become very silent what is the reason
Naga Chaitanya

గతేడాది లవ్‌స్టోరీతో హిట్‌కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థాంక్‌యూ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. విక్రమ్ కె.కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. వెంక‌టేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళ‌వికా నాయ‌ర్‌లు కీల‌క‌పాత్ర‌లో కనిపించనున్నారు. మ‌రోవైపు ఇంకో సిరీస్‌లో న‌టిస్తున్నాడు నాగ చైత‌న్య‌.

స‌మంత విడాకుల త‌ర్వాత తెగ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటోంది. సోష‌ల్ మీడియాలో అనేక ఆస‌క్తిక‌ర పోస్ట్ లు పెడుతోంది. కానీ నాగ చైత‌న్య మాత్రం పూర్తి సైలెంట్‌గా ఉంటున్నాడు. సినిమా ప్ర‌మోష‌న్స్ కి సంబంధించి కూడా ఎలాంటి పోస్ట్‌లు పెట్ట‌డం లేదు చైతూ. విడాకుల త‌ర్వాత చై పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లాడు. అతని సైలెన్స్‌ని అభిమానులు అస్స‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. అత‌ను తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి రావాల‌ని కోరుకుంటున్నారు. చైతూ న‌టించిన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment