Munagaku : ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు కూడా విరివిగానే వాడతారు. ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగను ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, అనేక జబ్బులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
మునగాకు మరియు కాయల్లో విటమిన్ ఎ, సి, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లావిన్), బి3 (నియాసిన్), బి6 మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. వాటిలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మునగ పూలల్లో గ్లూకోస్, సుక్రోజ్ , అమీనో యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఇక మరెన్నో యాసిడ్స్ లబిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే..మునగాకు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఆకు రసంలో కొద్దిగా పాలు పోసుకొని, తాగితే, ఎముకల పెరుగుదల పాటు రక్తశుద్ధి అవుతుంది. మునగాకును, కీరదోసతో, క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణ లభిస్తుంది. విటమిన్లు, ఇనుము, కాల్షియం వంటివి మునగాకులో పుష్కలంగా ఉండటం వలన గర్భిణీలలో రక్తహీనత సమస్య అనేది తగ్గుతుంది. మునగాకు పూలతో, ఆవు పాలని కలిపి కషాయం చేసి తాగితే, శృంగార బలహీనత సంబంధిత ఇబ్బందులను తొలగించే దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
మునగాకును ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్య వర్దినిలా కూడా వాడతారు. కొద్దిగా నిమ్మరసంలో,మునగాకు రసాన్ని కలిపి ఒక పేస్టులా చేసి ముఖానికి బాగా పట్టించాలి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మొటిమలు, నల్లన్ని మచ్చలు తగ్గుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…