Munagaku : మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా.. ముఖ్యంగా మగవారికి ఆ సమస్య రాదట..!

November 11, 2022 2:42 PM

Munagaku : ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు కూడా విరివిగానే వాడతారు. ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగను ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, అనేక జబ్బులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు ఒక దివ్య ఔషధంలా  పనిచేస్తుంది.

మునగాకు మరియు కాయల్లో విటమిన్ ఎ, సి, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లావిన్), బి3 (నియాసిన్), బి6 మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. వాటిలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మునగ పూలల్లో గ్లూకోస్, సుక్రోజ్ , అమీనో యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఇక మరెన్నో యాసిడ్స్ లబిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే..మునగాకు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు.

Munagaku benefits in telugu take regularly
Munagaku

ఈ ఆకు రసంలో కొద్దిగా పాలు పోసుకొని, తాగితే, ఎముకల పెరుగుదల పాటు రక్తశుద్ధి అవుతుంది. మునగాకును, కీరదోసతో, క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణ లభిస్తుంది. విటమిన్లు, ఇనుము, కాల్షియం వంటివి మునగాకులో పుష్కలంగా ఉండటం వలన గర్భిణీలలో రక్తహీనత సమస్య అనేది తగ్గుతుంది. మునగాకు పూలతో, ఆవు పాలని కలిపి కషాయం చేసి తాగితే, శృంగార బలహీనత సంబంధిత ఇబ్బందులను తొలగించే దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

మునగాకును ఆరోగ్యానికి మాత్రమే కాకుండా  సౌందర్య వర్దినిలా కూడా వాడతారు. కొద్దిగా నిమ్మరసంలో,మునగాకు రసాన్ని కలిపి ఒక పేస్టులా చేసి ముఖానికి బాగా పట్టించాలి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మొటిమలు, నల్లన్ని మచ్చలు తగ్గుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now