Mumtaj : చిక్కుల్లో నటి ముంతాజ్‌.. ఆమెపై ఆ కేసు నమోదు..!

May 12, 2022 2:17 PM

Mumtaj : నటి ముంతాజ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో మూవీల్లో నటించి అలరించింది. పవన్‌ కల్యాణ్‌ ఖుషి మూవీలో ఈమె ప్రత్యేక పాత్రలో నటించింది. అలాగే అప్పట్లో వెంకటేష్‌ నటించిన జెమిని సినిమాలో టైటిల్‌ సాంగ్‌లో మెరిసింది. అలాగే మహేష్‌ బాబు ఆగడు సినిమాలో విలన్‌ సోనూసూద్‌కు జోడీగా నటించింది. అలాగే అడపా దడపా ఐటమ్‌ సాంగ్స్‌ కూడా చేస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా చిక్కుల్లో పడింది. ఈమెపై ఒక విషయంలో కేసు నమోదైంది.

Mumtaj facing problems police registered case
Mumtaj

ముంతాజ్‌ చెన్నైలోని అన్నానగర్‌లో నివాసం ఉంటోంది. ఈమె ఉత్తరాదికి చెందిన ఇద్దరు బాలికలను పనిలో పెట్టుకుంది. వారు మైనర్లు. సరైన వయస్సు లేకుండా వారిని బాల కార్మికులుగా ఆమె పనిలో పెట్టుకుంది. పైగా వారిని పని చేయాల్సిందిగా ఆమె చిత్ర హింసలు పెడుతున్నదట. దీంతోపాటు వారిని అసభ్య పదజాలంతో దూషిస్తోందట. దీంతో ఆ ఇద్దరు బాలికల్లో ఒకామె ఎలాగో బయట పడి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ముంతాజ్‌ పై కేసు నమోదు చేవారు. ఈ క్రమంలోనే ఆ బాలికలను పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే ముంతాజ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ముంతాజ్‌ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈమె చివరిసారిగా వలయం అనే తమిళ సినిమాలో నటించింది. ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. త్వరలో విడుదల కానుంది. గతంలో ఈమె బిగ్‌ బాస్‌ తమిళ్‌ సీజన్‌ 2లో పార్టిసిపేట్‌ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment