Mrunal Thakur : మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్‌లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. సీతారామం చిత్రం సక్సెస్ ని అందుకోవడంతో మృణాల్ ఠాకూర్ కి ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్ బాగా పెరిగారు. ఇది ఇలా ఉంటే మృణాల్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ ఫొటోలో అయితే ఆమెకు స్కిన్ అలర్జీ రావడంతో ఇలా నల్లగా కమిలిపోయి కనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే అసలు ఇది మృణాల్ ఠాకూర్ ఫోటో కాదని వాదిస్తున్నారు. ఇంకొంత మంది ఇది ఏదైనా సినిమా షూటింగ్ కోసం మృణాల్ ఇలా తయారు అయి ఉంటుందని చెప్పుకొచ్చారు. గతంలో తను నటించిన ఓ సీరియల్‌లోని లుక్ అయ్యుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేది మాత్రం క్లారిటీ లేదు.
మొత్తానికి సీతారామం చిత్రంలో చీరకట్టులో గ్లామర్స్ లుక్ తో ఎంతో మంది మనసు దోచుకున్న మృణాల్ ఈ ఫొటోలో పూర్తిగా డీగ్లామర్‌తో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్ ఠాకూర్ కుంకుమ భాగ్య అనే హిందీ సిరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో హీరోయిన్‌కి చెల్లిగా మృణాల్ నటించింది. ఈ సీరియల్ తెలుగులో సైతం మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో సూపర్ 30, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఘనమైన విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడిియాలో హల్చల్ చేస్తున్న మృణాల్ డీ గ్లామరస్ ఫోటో కి గల కారణం ఏంటో మృణాల్ స్పందిస్తేనే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…