గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mrunal Thakur : సీతారామం హీరోయిన్‌ ఏంటి.. ఇలా అయిపోయింది..?

Mrunal Thakur : మృణాల్‌ ఠాకుర్‌.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి  సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా…

Mrunal Thakur : సీతారామం హీరోయిన్‌ ఏంటి.. ఇలా అయిపోయింది..?

Mrunal Thakur : మృణాల్‌ ఠాకుర్‌.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి  సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది.  ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్‌లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. సీతారామం చిత్రం సక్సెస్ ని అందుకోవడంతో మృణాల్ ఠాకూర్ కి ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్  బాగా పెరిగారు. ఇది ఇలా ఉంటే మృణాల్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఈ ఫొటోలో అయితే ఆమెకు స్కిన్ అలర్జీ రావడంతో ఇలా నల్లగా కమిలిపోయి కనిపిస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే అసలు ఇది మృణాల్ ఠాకూర్ ఫోటో కాదని వాదిస్తున్నారు. ఇంకొంత మంది ఇది ఏదైనా సినిమా షూటింగ్ కోసం మృణాల్  ఇలా తయారు అయి ఉంటుందని  చెప్పుకొచ్చారు. గతంలో తను నటించిన ఓ సీరియల్‌లోని లుక్‌ అయ్యుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫొటో ఎప్పటిది అనేది మాత్రం క్లారిటీ లేదు.

Mrunal Thakur what happened she is changed
Mrunal Thakur

మొత్తానికి సీతారామం చిత్రంలో చీరకట్టులో గ్లామర్స్ లుక్ తో ఎంతో మంది మనసు దోచుకున్న మృణాల్‌ ఈ ఫొటోలో పూర్తిగా డీగ్లామర్‌తో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్‌ ఠాకూర్‌ కుంకుమ భాగ్య అనే హిందీ సిరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో హీరోయిన్‌కి చెల్లిగా మృణాల్ నటించింది. ఈ సీరియల్‌ తెలుగులో సైతం మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో సూపర్‌ 30, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. మృణాల్‌  సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఘనమైన విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడిియాలో హల్చల్ చేస్తున్న మృణాల్ డీ  గ్లామరస్ ఫోటో కి గల కారణం ఏంటో మృణాల్ స్పందిస్తేనే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి