OTT : ఈ వారం ఓటీటీలు, థియేట‌ర్ల‌లో అల‌రించ‌నున్న మూవీలు ఇవే..!

May 2, 2022 7:25 PM

OTT : క‌రోనా స‌మ‌యంలో పెద్ద‌గా సినిమాల సంద‌డి లేద‌నే చెప్పాలి. కరోనా కాస్త శాంతించాక ప్ర‌తి వారం ఇటు థియేట‌ర్స్, అటు ఓటీటీలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు క్యూ క‌డుతున్నాయి. ఇందులో తెలుగుతోపాటు ప‌లు భాష‌ల‌కు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్, సోనీ లివ్‌తో పాటు ఇత‌ర ప్లాట్ ఫామ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కానున్న మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

movies releasing on OTT apps and in theatres on May 6th 2022
OTT

కీర్తి, సురేష్ సెల్వ‌రాఘ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన సాని కాయిదం చిత్రం మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.ఇందులో కీర్తి సురేష్ మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టనుంది.

అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. మే 6న జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ త‌ప్ప‌క అల‌రిస్తుంది.

కన్నడ భాషకు చెందిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొంద‌గా, ఇందులో ధర్మన్న కడూర్, కె జయరామ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మే 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది.

హిందీ భాషకు సంబంధించిన థ్రిల్లర్ థార్ మూవీ. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో న‌టించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ లో మే 6వ తేదీన ప్రీమియర్ అవ‌నుంది. 80ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందింది.

ఇక థియేట‌ర్‌ల‌లో ప్రద‌ర్శించ‌బ‌డే సినిమాల విష‌యానికి వ‌స్తే..

యంగ్ హీరో శ్రీవిష్ణు మెయిన్ లీడ్ లో వస్తోన్న భళా తందనాన సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా, కేథరిన్ హీరోయిన్ గా నటించింది.

యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన సుమ వెండితెరపై న‌టించిన‌ మూవీ జయమ్మ పంచాయతీ.. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఇందులో పల్లెటూరి మహిళ‌ పాత్రలో సుమ క‌నిపించ‌నుంది.

కరోనా వల్ల‌ పలుమార్లు వాయిదా పడిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6వ తేదీన‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించారు.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment