India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సినిమాలు, సిరీస్‌ల వివ‌రాలు..!

IDL Desk by IDL Desk
Monday, 4 July 2022, 10:56 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

OTT : వారం వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు సంద‌డి చేస్తుంటాయి. అయితే ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. దీంతో వారం మారిన త‌రువాత ఈ వారం కొత్త సినిమాలు ఏవి వ‌స్తున్నాయి.. అని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఓటీటీ యాప్‌లు కూడా కొత్త సినిమాల‌ను రిలీజ్ చేయ‌డంలో పోటీలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అనేక కొత్త సినిమాలు ఈ యాప్‌ల‌లో సంద‌డి చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ప‌లు కొత్త మూవీలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అలాగే కొన్ని సిరీస్‌ల‌ను కూడా లాంచ్ చేయ‌నున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో వ‌స్తున్న సినిమాలు, సిరీస్ ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా నిర్వ‌హించిన కాఫీ విత్ క‌రణ్ షోకు మంచి పేరుంది. గ‌తంలోఈ షోకు రేటింగ్స్ బాగా వ‌చ్చాయి. క‌నుక ఈ షోను ఎప్ప‌టి నుంచో కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఇక ఇదే షోకు చెందిన 7వ సీజ‌న్ ఈ వారం నుంచే స్ట్రీమ్ కానుంది. దీన్ని జూలై 7వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయ‌నున్నారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ షోను వీక్షించ‌వ‌చ్చు. ఈసారి సీజ‌న్‌లో ఓ ఎపిసోడ్‌లో స‌మంత పాల్గొంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఏ ఎపిసోడ్‌లో ఉంది.. అస‌లు ఆమె ఏం మాట్లాడింది.. అన్న వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఈ షో కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈమెతోపాటు అక్ష‌య్ కుమార్‌, అనిల్ క‌పూర్‌, సారా అలీ ఖాన్ వంటి వారు కూడా ఈ సారి సీజ‌న్‌లో గెస్ట్‌లుగా రానున్నారు. దీంతో ఈ సీజ‌న్‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

movies and series releasing on OTT on July 8th 2022
OTT

మ‌ళ‌యాళంలో తెర‌కెక్కిన ప‌కా రివ‌ర్ ఆఫ్ బ్ల‌డ్ అనే మూవీని సోనీ లివ్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని జూలై 7 నుంచి స్ట్రీమ్ చేయ‌నున్నారు. అలాగే జూలై 8 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో బూ, బిచ్ అనే టీవీ షోను ప్రసారం చేయ‌నున్నారు. కామెడీ, సైఫై, ఫాంట‌సీ జోన‌ర్‌ల‌లో దీన్ని తెర‌కెక్కించారు. జూలై 8వ తేదీనే కుంజెల్దో అనే మ‌ళ‌యాళం సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ కామెడీ మూవీని జీ5 యాప్‌లో చూడ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 8వ తేదీన మోడ్ర‌న్ ల‌వ్‌: హైద‌రాబాద్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కింది. అలాగే బేర్ గ్రిల్స్, ర‌ణ్‌వీర్ లు క‌లిసి చేసిన ప్ర‌త్యేక ఎపిసోడ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు. హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంటుంది. జూలై 8న ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేస్తారు.

క‌మ‌ల‌హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన విక్ర‌మ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో ఈ మూవీని జూలై 8వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. త‌మిళం, తెలుగు, మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. నాని, న‌జ్రియా న‌టించిన అంటే సుంద‌రానికీ.. మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. ఇలా ప‌లు మూవీలు, సిరీస్‌లు ఈ వారంలో ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి.

Tags: moviesottseries
Previous Post

Dil Raju With Son : కొడుకును చూసి దిల్ రాజు ప‌ట్ట‌లేనంత ఆనందం.. ఫొటో వైర‌ల్‌..!

Next Post

Samantha : స‌మంత‌ను టార్గెట్ చేస్తున్న మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌.. భారీగా ట్రోలింగ్‌..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
వార్తా విశేషాలు

Pooja Hegde : పాపం.. పూజా హెగ్డెకి దారుణ‌మైన అవ‌మానం.. ఇలా చేశారేంటి..?

by Sunny
Sunday, 3 April 2022, 10:07 AM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.