OTT : వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ఓటీటీ ప్లాటఫామ్ లు కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లతో సందడి చేస్తూ ఉంటాయి. ఎంతో మంది ఓటీటీలలో రాబోయే షో లు , చిత్రాలు, వెబ్ సిరీస్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ వారం కూడా నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్ లాంటి ఓటీటీ వేదికలపై పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు పలకరించనున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రవితేజ హీరోగా, మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్ గా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం సెప్టెంబర్ 15 నుండి సోనీ లివ్ లో ప్రసారం కానుంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన జోగీ అనే సినిమా కూడా సెప్టెంబర్ 16 నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శితం కానుంది. 1980ల నాటి సిక్కు అల్లర్ల నేపథ్యంలో సామాజిక కోణంలో ఈ చిత్రం సాగనుంది.
ఇక థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన అటెన్షన్ ప్లీజ్ అనే చిత్రం కూడా సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అలాగే ఓటీటీలో బాగా పాపులర్ అయిన కాలేజ్ రొమాన్స్ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీజన్ 3 సోనీ లివ్ లో సెప్టెంబర్ 16 నుండి మొదలు కానుంది.
ఒకప్పటి ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా బయోగ్రఫికల్ డ్రామాగా తెరకెక్కిన బ్లాండే మూవీ సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతుంది. అనా డే అర్మాస్ ఈ మూవీలో మార్లిన్ మన్రో పాత్రలో నటించింది. ఇలా పలు మూవీలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…