OTT : ఈ వారం ఓటీటీల్లో, థియేట‌ర్ల‌లో అల‌రించనున్న మూవీలు, సిరీస్‌లు ఇవే..!

OTT : ప్ర‌తి వారం మార‌గానే ఓటీటీ యాప్‌లు కొత్త కొత్త మూవీలు, సిరీస్‌ల‌ను రిలీజ్ చేస్తూ సంద‌డి చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ప‌లు మూవీలు, సిరీస్‌లు విడుద‌ల కానున్నాయి. ఈ క్ర‌మంలోనే వారం మారాక ప్రేక్ష‌కులు కూడా కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారంలో ఓటీటీ యాప్‌ల‌లో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

OTT

ఆలియా భ‌ట్ న‌టించిన గంగూబాయి క‌తియ‌వాడి మూవీ ఈ వారం స్ట్రీమ్ కానుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, జీ5ల‌లో స్ట్రీమ్ కానుంది.

ఇక తాప్సీ న‌టించిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఈ సినిమాను థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లోనే ఏప్రిల్ 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

టామ్ హాలండ్ న‌టించిన అన్‌చార్టెడ్ ఈ నెల 28వ తేదీ నుంచి బుక్ మై షోలో స్ట్రీమ్ కానుంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ జోన‌ర్‌లో దీన్ని తెర‌కెక్కించారు. అలాగే ఒజార్క్ సిరీస్‌లో సీజ‌న్ 4 పార్ట్ 2 ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు. ఏప్రిల్ 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది. దీంతోపాటు నెవ‌ర్ కిస్ యువ‌ర్ బెస్ట్ ఫ్రెండ్ సిరీస్‌కు చెందిన సీజ‌న్ 2ను జీ5 లో ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఈ వారం ఓటీటీల్లో గంగూబాయి, మిషన్ ఇంపాజిబుల్ త‌ప్ప చెప్పుకోద‌గిన చిత్రాలు ఏమీ లేవ‌నే చెప్పాలి.

ఇక థియేట‌ర్ల‌లో ఈ వారం ప‌లు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి ప్ర‌ధాన పాత్రల్లో తెరకెక్కిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. స‌మంత‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నిర్మించ‌బ‌డిన కాతు వాకుల రెండు కాద‌ల్ మూవీ ఈ నెల 28న విడుద‌ల కానుంది. అలాగే అజ‌య్ దేవ‌గ‌న్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ర‌న్ వే 34 చిత్రం కూడా ఏప్రిల్ 29వ తేదీనే విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM