Meena : మీనా గ‌ర్భ‌వ‌తా..? ఆమె లుక్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు..!

Meena : ఒక‌ప్పుడు స్టార్ హీరోలు అంద‌రితో క‌లిసి న‌టించి అల‌రించిన అందాల ముద్దుగుమ్మ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆ త‌ర్వాత తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. ఆమె తోటి హీరోయిన్స్ అంతా క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయారు. కానీ మీనా మాత్రం ఇంకా హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తోంది. రీసెంట్ గా దృశ్యం 2తో అలరించింది ఈ బ్యూటీ. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబ‌ర్ 16న మ‌ద్రాసులో జ‌న్మించారు. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది.

Meena

మీనా మ‌రోసారి త‌ల్లి కాబోతుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాజాగా మీనా పోస్ట్ చేసిన‌ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్‌ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్‌ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్‌ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.. అంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. అంటే రియ‌ల్‌గా కాకుండా రీల్ లైఫ్‌లోనూ గ‌ర్భ‌వ‌తిగా క‌నిపించ‌నుంది మీనా.

మీనా ఒకవైపు ప‌లు పాత్ర‌లు చేస్తూ సంద‌డి చేస్తుండ‌గా.. ఆమె కూతురు కూడా అల‌రిస్తోంది. విజయ్‌ హీరోగా నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత భాస్కర్‌ ఒరు రాస్కెల్ లో అరవింద్‌ స్వామితోనూ నటించింది. ఇక రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తేలో నటిస్తోంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ తో క‌లిసి దృశ్యం 2 సినిమాలో కూడా నటించింది. త‌రువాత కూడా అనేక సినిమా ఆఫర్ల‌ను మీనా అందుకుంటూ వ‌స్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM