moto e32 : తక్కువ బడ్జెట్‌లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తూ.. మోటోరోలా వినియోగదారుల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మోటోరోలా నుంచి చాలానే విడుదలయ్యాయి. ఇక మరో ఫోన్ ను కూడా మోటోరోలా విడుదల చేసింది. మోటో ఇ32 పేరిట మోటోరోలా ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా.. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇక ఇందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..
మోటో ఇ32 స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి37 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా.. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందించనున్నట్లు మోటోరోలా తెలియజేసింది.
ఇక ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా.. దీనికి తోడు అదనంగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
మోటో ఇ32 స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, ఐస్ బర్గ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.10,499గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను ఇప్పటికే విక్రయిస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద జియో కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2549 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…