Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా బన్నీ వాసు నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కెరీర్‌లో సరైన హిట్ లేక అసంతృప్తితో ఉన్న అఖిల్‌కు ఈ మూవీ అయినా సరే హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీకి చెందిన పోస్టర్స్, టీజర్స్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభించింది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఇందులో అఖిల్ అదరహో అనిపించాడు.
పెళ్లి చేసుకోవడం కన్నా ముందు కెరీర్ ముఖ్యమని, ఎంతో కాలంగా వేచి చూసి చివరకు పెళ్లి చేసుకునేందుకు అఖిల్ యత్నిస్తుంటాడు. అందులో భాగంగా పూజ హెగ్డె పరిచయం కావడం.. ఆ తరువాత జరిగే పరిణామాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సినిమాలో కూడా ఇలాంటి ట్విస్టులు ఉంటాయని ముందుగానే మనం గ్రహించవచ్చు. చాలా కాలం తరువాత భిన్నమైన లుక్‌లో అఖిల్ ఇందులో కనిపించాడు. ఫ్రెష్‌గా మూవీ వచ్చింది. కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…