Most Eligible Bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్.. అఖిల్ చించేశాడు.. హిట్ ప‌క్కా..

September 30, 2021 6:17 PM

Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా బ‌న్నీ వాసు నిర్మాణంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. కెరీర్‌లో స‌రైన హిట్ లేక అసంతృప్తితో ఉన్న అఖిల్‌కు ఈ మూవీ అయినా స‌రే హిట్ ఇవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Most Eligible Bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. బొమ్మ అదుర్సే..!
Most Eligible Bachelor

ఇక ఈ మూవీకి చెందిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్‌కు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భించింది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను లాంచ్ చేసింది. ఇందులో అఖిల్ అద‌ర‌హో అనిపించాడు.

పెళ్లి చేసుకోవ‌డం క‌న్నా ముందు కెరీర్ ముఖ్య‌మని, ఎంతో కాలంగా వేచి చూసి చివ‌ర‌కు పెళ్లి చేసుకునేందుకు అఖిల్ య‌త్నిస్తుంటాడు. అందులో భాగంగా పూజ హెగ్డె ప‌రిచ‌యం కావ‌డం.. ఆ త‌రువాత జ‌రిగే ప‌రిణామాల‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. సినిమాలో కూడా ఇలాంటి ట్విస్టులు ఉంటాయ‌ని ముందుగానే మ‌నం గ్ర‌హించ‌వ‌చ్చు. చాలా కాలం త‌రువాత భిన్న‌మైన లుక్‌లో అఖిల్ ఇందులో క‌నిపించాడు. ఫ్రెష్‌గా మూవీ వ‌చ్చింది. క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

ఈ మూవీకి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. గీతా ఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అక్టోబ‌ర్ 15న ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now