POCO C31 : మొబైల్స్ తయారీదారు పోకో కొత్తగా పోకో సి31 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అత్యంత తక్కువ ధరకు ఈ ఫోన్ లభిస్తోంది. ఫీచర్లు మాత్రం అదిరిపోయాయి. ఈ ఫోన్‌లో 6.53 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్‌ను అమర్చారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో రెండు సిమ్‌లను, ఒక మైక్రో ఎస్‌డీ కార్డును వేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడుగా మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఇచ్చారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.
పోకో సి31 స్మార్ట్ ఫోన్ షాడో గ్రే, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8499 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9499గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 2 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా విక్రయిస్తారు. ఈ ఫోన్‌పై యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…