Most Eligible Bachelor : ద‌స‌రా బాక్సాఫీస్ విజేత‌.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. క‌లెక్ష‌న్ల‌తో దుమ్ము రేపుతోంది..!

October 18, 2021 9:43 AM

Most Eligible Bachelor : ద‌స‌రా 2021 పండుగ సీజ‌న్‌కు బాక్సాఫీస్ వ‌ద్ద మూడు సినిమాలు సంద‌డి చేశాయి. శ‌ర్వానంద్‌, సిదార్థ్ న‌టించిన మ‌హా స‌ముద్రం, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌తోపాటు పెళ్లి సంద‌D మూవీలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాల్లోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ క్లియ‌ర్ విన్న‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

Most Eligible Bachelor is dasara 2021 box office winner

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మొద‌టి వీకెంగ్ క‌లెక్ష‌న్లు అద్భుతంగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ‌, యూఎస్ఏల‌లో ఈ సినిమా స‌మాన క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తోంది. ఇక తొలి వీకెండ్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మూవీ రూ.15.50 కోట్ల షేర్ ను సాధించి దూసుకుపోతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ త‌రువాత రెండో బిగ్గెస్ట్ తెలుగు ఓపెన‌ర్‌గా మంచి స‌క్సెస్‌ను సాధించింది.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ అమెరికాలోనూ 4 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. పెళ్లి సంద‌D చిత్రానికి వ‌స్తే చిత్రం బ‌డ్జెట్ ప్ర‌కారం మంచి వ‌సూళ్ల‌నే సాధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీకి ఆ రెండు చిత్రాలు పోటీని ఇవ్వ‌లేక‌పోయాయి. అందువ‌ల్ల ద‌స‌రా బాక్సాఫీస్ విజేత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

ఇక మ‌హా స‌ముద్రం మూవీకి అయితే 4వ రోజు క‌లెక్ష‌న్లు చాలా పూర్‌గా ఉన్నాయి. మ‌రి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా, లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment