Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కీర్తి సురేష్ జంటగా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టయిల్‌లో తెరకెక్కించిన చిత్రం మరక్కార్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ బాహుబలి చిత్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమో చూసిన అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ ఏడాది క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడం కోసం ఎన్నో ఓటీటీ సంస్థలు పెద్ద ఆఫర్లను కూడా ప్రకటించాయి. అయితే వీటిని కాదని ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని చిత్రబృందం భీష్మించుకుంది. థియేటర్లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ అభిమానులు కూడా ఈ సినిమాను ధియేటర్లో చూడటానికి ఇష్టపడ్డారు. అయితే చివరికి ఈ సినిమా పలు కారణాల వల్ల థియేటర్లలో కాకుండా ఓటీటీ విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.
ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను బుల్లి స్క్రీన్‌పై చూడటాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అలా చిన్న తెరపై చూడటం మాత్రం అభిమానులకు నచ్చడం లేదని చెప్పాలి. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…