Mohanlal :  ఓటీటీలో విడుదల కాబోతున్న మోహన్ లాల్ మరక్కార్.. జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు..!

November 1, 2021 8:48 PM

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కీర్తి సురేష్ జంటగా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టయిల్‌లో తెరకెక్కించిన చిత్రం మరక్కార్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ బాహుబలి చిత్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమో చూసిన అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా ఈ ఏడాది క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది.

Mohanlal marakkar is releasing on ott fans not happy

ఈ క్రమంలోనే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడం కోసం ఎన్నో ఓటీటీ సంస్థలు పెద్ద ఆఫర్లను కూడా ప్రకటించాయి. అయితే వీటిని కాదని ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని చిత్రబృందం భీష్మించుకుంది. థియేటర్లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ అభిమానులు కూడా ఈ సినిమాను ధియేటర్లో చూడటానికి ఇష్టపడ్డారు. అయితే చివరికి ఈ సినిమా పలు కారణాల వల్ల థియేటర్లలో కాకుండా ఓటీటీ విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.

ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను బుల్లి స్క్రీన్‌పై చూడటాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అలా చిన్న తెరపై చూడటం మాత్రం అభిమానులకు నచ్చడం లేదని చెప్పాలి. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment