Marakkar : వామ్మో.. అడ్వాన్స్ బుకింగ్ లతోనే.. రూ.100 కోట్లు సంపాదించిన సినిమా..!

December 1, 2021 7:39 PM

Marakkar : సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుందంటే ఆ సినిమా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇలా ఒక వారం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ లు పూర్తి అవుతాయి. అయితే ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను దక్కించుకుంటారు. కానీ ఒక సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే రూ.100 కోట్లను కొల్లగొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

Marakkar : వామ్మో.. అడ్వాన్స్ బుకింగ్ లతోనే.. రూ.100 కోట్లు సంపాదించిన సినిమా..!

మాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘మరక్కార్ : అరబికడలింటే సింహం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో భాగంగా ఏకంగా రూ.100 కోట్లను కొల్లగొట్టినట్లు మోహన్ లాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం వైరల్ గా మారడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Marakkar : 4,100 స్క్రీన్స్‌లో 16 వేల షోస్‌

ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, మంజు వారియర్‌తోపాటు సిద్ధిక్‌ ప్రధాన పాత్రలలో నటించారు. ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించినా.. ఈ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా 4,100 స్క్రీన్స్‌లో 16 వేల షోస్‌తో విడుదలవుతున్నట్టు తెలిపిన మోహన్ లాల్.. టికెట్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టినట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment