రోజా కూతురికి దక్కిన అరుదైన గౌరవం.. కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేసిన అన్షు..!

October 7, 2021 3:48 PM

సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు అన్షు మాలిక, కృష్ణ లోహిత్ అనే సంతానం ఉన్నారు. అయితే రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూయెన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటోను ముద్రించడంతో అన్షు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనకల నెరవేరిందని సంబరపడింది.

MLA Roja daughter anshu very happy with her achievement

రచయితగా, ఎంటర్ప్రైజెస్ న్యూయర్ గా, ప్రోగ్రామర్ గా సమాజం కోసం పాటుపడుతున్న సూపర్ స్టార్ అవార్డుకు అన్షు మాలిక ఎంపికైందని ఇన్ఫ్లూయెన్సర్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈ విషయంపై నటి రోజా స్పందిస్తూ.. ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా గత కొద్ది రోజుల క్రితం వర్ణ అచీవర్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై టాలెంట్ గా అన్షు ఫోటోను ప్రచురించారు.

ఇంత చిన్న వయసులోనే ఇలా కవర్ పేజ్ పై తన ఫొటోలు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని, దీని ద్వారా తన కల నెరవేరిందంటూ అన్షు తెలియజేసింది. ఇక ఈ విషయం తెలిసిన రోజా అభిమానులు రోజా కూతురు కూడా ఎంతో టాలెంటెడ్ అని, ఆమె కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే రోజా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని పలువురు అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now