MLA Raja Singh : తొలిసారి సమంత పుష్ప సినిమా కోసం స్పెషల్ డ్యాన్స్ చేయగా, ఇందులో ఈ అమ్మడు తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ పాటకు సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్‌కి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐటమ్ సాంగ్స్‌ని దేవుడిని పూజిస్తూ చెప్పే శ్లోకాలతో పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్లని కించపరిచేలా దేవిశ్రీ వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం చెప్పారు. మీరు సినిమాలు తీయండి.. గ్రాండ్‌గా సక్సెస్ చేసుకోండి కానీ ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆయన ప్రశ్నించారు. దేవుడి శ్లోకాలకు ఐటమ్ సాంగ్స్‌కి తేడా లేదా ? మీరు కావాలని చేశారా.. అనుకోకుండా చేశారా ? అంత అవసరమేముందని రాజా సింగ్ నిలదీశారు. హిందూ సమాజం, హిందూ సైన్యం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే మరోలా మాట్లాడాల్సి వస్తుందని రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా టీంతో కలసి పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ తను కంపోజ్ చేసిన రింగ రింగా.. ఊ అంటావా మావ ఊఊ అంటావా పాటలను భక్తి గీతాలుగా మార్చి పాడారు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్, భక్తి శ్లోకాలు తన దృష్టిలో ఒకటే అని చెప్పడంతో వివాదం రేగింది. దీనిపై క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…