MLA Raja Singh : దేవి శ్రీ ప్ర‌సాద్‌కి బీజేపీ లీడ‌ర్ వార్నింగ్‌

December 18, 2021 6:11 PM

MLA Raja Singh : తొలిసారి స‌మంత పుష్ప సినిమా కోసం స్పెష‌ల్ డ్యాన్స్ చేయ‌గా, ఇందులో ఈ అమ్మ‌డు త‌న డ్యాన్స్‌తో ఇర‌గ‌దీసింది. ఈ పాట‌కు సూపర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సాంగ్‌కి సంబంధించి వివాదం కొన‌సాగుతున్న నేథ్యంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐటమ్ సాంగ్స్‌ని దేవుడిని పూజిస్తూ చెప్పే శ్లోకాలతో పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Raja Singh given warning to devi sri prasad

హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్లని కించపరిచేలా దేవిశ్రీ వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం చెప్పారు. మీరు సినిమాలు తీయండి.. గ్రాండ్‌గా సక్సెస్ చేసుకోండి కానీ ఇలాంటి వ్యాఖ్యలేంటని ఆయన ప్రశ్నించారు. దేవుడి శ్లోకాలకు ఐటమ్‌ సాంగ్స్‌కి తేడా లేదా ? మీరు కావాలని చేశారా.. అనుకోకుండా చేశారా ? అంత అవసరమేముందని రాజా సింగ్ నిలదీశారు. హిందూ సమాజం, హిందూ సైన్యం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే మరోలా మాట్లాడాల్సి వస్తుందని రాజా సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా టీంతో కలసి పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ తను కంపోజ్ చేసిన రింగ రింగా.. ఊ అంటావా మావ ఊఊ అంటావా పాటలను భక్తి గీతాలుగా మార్చి పాడారు. అంతేకాకుండా ఐటమ్‌ సాంగ్స్, భక్తి శ్లోకాలు తన దృష్టిలో ఒకటే అని చెప్పడంతో వివాదం రేగింది. దీనిపై క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now