Maa : ‘మా’ ఎన్నిక‌ల‌పై మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

October 4, 2021 4:36 PM

Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఒక‌రికి మించి ఒక‌రు ఎత్తులు వేస్తూ ప్ర‌చారంలో ముందుకు సాగిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు రోజు రోజుకీ మాటల యుద్ధం పెంచారు. ఇక తాజాగా ప్ర‌కాష్ రాజ్.. మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చిన న‌రేష్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. దీంతో హీట్ మ‌రింత పెరిగింది.

Maa : మా ఎన్నిక‌ల‌పై మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అయితే ‘మా’ ఎన్నిక‌ల‌పై అటు ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నిక‌ల‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. అలాగే ‘మా’ ఎన్నిక‌ల‌కు, వైసీపీకి, సీఎం జ‌గ‌న్‌కు కూడా ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చేశారు. దీంతో మంత్రి పేర్ని నాని గ‌త కొద్ది రోజులుగా వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

కాగా ప‌వ‌న్, జ‌న‌సేన సానుభూతి ప‌రులు, టీడీపీ నాయ‌కులు గ‌త కొద్ది రోజులుగా వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌, మంత్రుల‌పై ‘మా’ ఎన్నిక‌ల గురించి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ‘మా’ ఎన్నిక‌ల్లో వారు క‌ల‌గ‌జేసుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఈ విష‌యంపై తేల్చేయ‌డంతో.. ప్ర‌త్య‌ర్థులు ఇంకా ఏమైనా కొత్త అస్త్రాలు సంధిస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now