Mega Fans vs Mahesh Fans : ఒక‌రినొక‌రు దారుణంగా తిట్టుకుంటున్న‌.. మెగాఫ్యాన్స్‌, మ‌హేష్ ఫ్యాన్స్‌..!

May 14, 2022 9:30 AM

Mega Fans vs Mahesh Fans : మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ క‌లిసి న‌టించిన చిత్రం.. ఆచార్య‌. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే అనుకున్న మేర విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. మొత్తంగా చూస్తే రూ.84 కోట్ల మేర నిర్మాత‌ల‌కు ఈ మూవీ న‌ష్టాల‌ను తెచ్చి పెట్టింద‌ని అధికారిక లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే ఆచార్య ఫ్లాప్ కావ‌డంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఆచార్య మూవీ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచింది.

ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం మే 12న రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలోనే సినిమా బంప‌ర్ హిట్ అయింద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ కూడా చేసుకున్నారు. ఇక తొలి రోజు ఈ మూవీ ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్‌ను వ‌ర‌ల్డ్ వైడ్‌గా సాధించింద‌ని.. ఇది ఒక తెలుగు సినిమాకు ఒక రోజుకు ల‌భించిన అధిక మొత్తాల్లో ఒక‌ట‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే దీనిపై మెగాఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. మ‌హేష్ బాబు ఫేక్ క‌లెక్ష‌న్స్ చూపెడుతున్నార‌ని ఆరోపిస్తూ.. వారు సోష‌ల్ మీడియాలో #SVPFakeCollections అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

Mega Fans vs Mahesh Fans quarrelling together in social media
Mega Fans vs Mahesh Fans

అయితే ఇందుకు ప్ర‌తిగా మ‌హేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వారు ఏకంగా #MegaFamilyRankuMogudu అని చెప్పి ఇంకో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్‌లో మెగా ఫ్యాన్స్‌, మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. మీ హీరో వేస్ట్‌.. అంటే.. మీ హీరోనే వేస్ట్‌.. అని ఫ్యాన్స్ ఒక‌రిని ఒక‌రు తిట్టుకుంటున్నారు. అయితే వాస్త‌వానికి ఆచార్య‌కు మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుక‌నే తాము మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశామ‌ని.. అలాగే త‌ప్పుడు కలెక్ష‌న్లని చెబుతూ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. క‌నుకనే తాము మెగాఫ్యామిలీకి చెందిన హ్యాష్ ట్యాగ్ పేరిట ట్వీట్స్‌ను ట్రెండ్ చేస్తున్నామ‌ని.. మ‌హేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ గొడ‌వ ఎప్ప‌టికి స‌ద్దుమ‌ణుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment