Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో సినిమా తీయొద్ద‌ని మెగా కాంపౌండ్ నుంచి వార్నింగ్ ఇచ్చారు.. నిర్మాత సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి..?

Uday Kiran : ల‌వ‌ర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న తొలి మూడు చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరో అయ్యారు. చిత్రం, నువ్వునేను, మ‌న‌సంతా నువ్వే సినిమాలు ఆయ‌న‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను క‌ట్ట‌బెట్టాయి. దీంతో ఆయ‌న వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ త‌రువాత తీసిన సినిమాలు అన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. ఒక‌టి రెండు సినిమాలు మాత్రం ఫ‌ర్వాలేద‌నిపించాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్‌కు సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. త‌రువాత ఆయ‌న డిప్రెష‌న్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారు. ఇదంతా బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసిన విష‌య‌మే.

అయితే ఉద‌య్ కిర‌ణ్ డిప్రెష‌న్‌తో చ‌నిపోలేద‌ని.. అందుకు వేరే కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. జూన్ 26వ తేదీన ఉద‌య్ కిర‌ణ్ 42వ జ‌యంతి. దీంతో ఆయ‌న సినిమాల‌కు చెందిన విష‌యాల‌తోపాటు ప‌లు ఇత‌ర అంశాల‌ను కూడా నెటిజన్లు పైకి తెస్తున్నారు. వాటిల్లో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి అంశం. అప్ప‌ట్లో ఆయ‌న త‌న కుమార్తె సుస్మిత‌ను ఉద‌య్‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నారు. వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. కానీ ఇద్ద‌రికీ మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయారు. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. అయితే ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకున్న చిరంజీవి ఉద‌య్‌కి సినిమా అవ‌కాశాలు రాకుండా చేశార‌ట‌. ఇదే విష‌యాన్ని తాజాగా నిర్మాత ఏఎం ర‌త్నం క‌న్‌ఫామ్ చేశారు.

Uday Kiran

ఏఎం ర‌త్నం ఇటీవ‌లే ఓ ఫంక్ష‌న్‌కు రాగా ఆయ‌న ఉద‌య్ కిర‌ణ్‌కు సంబంధించి కీలక విష‌యాల‌ను వెల్ల‌డించారు. అప్ప‌ట్లో ఉద‌య్‌తో క‌ల‌సి ఆయ‌న తెలుగు, త‌మిళం భాష‌ల్లో ఓ మూవీని తీశారు. దాని షూటింగ్ 80 శాతం వ‌ర‌కు కంప్లీట్ అయింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి రావ‌డంతో ఆ సినిమా షూటింగ్‌ను నిలిపివేశార‌ట‌. దీంతో ఉద‌య్‌కు హ‌ఠాత్తుగా సినిమాల్లో అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి. ఇవే విష‌యాల‌ను ఏఎం ర‌త్నం చెప్పార‌ని ప్ర‌స్తుతం వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వీటిల్లో నిజం ఎంత ఉంది అనే విష‌యం తెలియాల్సి ఉంది.

కాగా.. ఉద‌య్ కిర‌ణ్ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో సూసైడ్ చేసుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది కార‌ణం కాద‌ని.. ఉద‌య్‌కి ఆస్తులు, భూములు బాగానే ఉన్నాయ‌ని ఆయ‌న సోద‌రి వెల్ల‌డించారు. సినిమాల్లో అవ‌కాశాలు రాక డిప్రెష‌న్‌కు గుర‌య్యే ఆయ‌న సూసైడ్ చేసుకుని ఉంటార‌ని అన్నారు. అయితే ఆయన మృతికి కార‌ణం ఎవ‌రు అయినా స‌రే ప్ర‌స్తుతం మ‌రోసారి చిరంజీవి కుటుంబాన్ని ఇందులోకి లాగుతున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM