Meena : అది నా డ్రీమ్ క్యారెక్టర్‌.. ఆమె దొబ్బేసింది.. మీనా సంచ‌ల‌న కామెంట్స్‌..

October 3, 2022 4:43 PM

Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళ‌యాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈక్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అయితే రీసెంట్ గా భర్తను కోల్పోయిన మీనా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యింది. ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

అలాగే మీనా ఇటీవల తన 46వ పుట్టినరోజును ప్రాణస్నేహితుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ సాధారణ వ్యక్తిలా మారిపోతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా ఆ హీరోయిన్ అంటే నాకు అసూయ అంటూ చెప్పుకొచ్చింది మీనా. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యే విడుదలైన డైరెక్టర్ మణిశర్మ పొన్నియన్ సెల్వన్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Meena said she missed to do Aishwarya Rai character in Ponniyin Selvan movie
Meena

చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అలాంటి అందాన్ని మరింత అందంగా చూపించడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్. అయితే నిజానికి ఈ మూవీలో ఐశ్వర్య రాయ్ పాత్ర మీనా డ్రీమ్ ప్రాజెక్ట్ అని మీనా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆమెకు అలాంటి ప్రాజెక్టు రాలేదట. దీంతో ఫస్ట్ టైం ఐశ్వర్యని చూసి అసూయ పడుతున్నాను అని.. నా కెరియర్ లోనే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే ఇలా అనిపిస్తుంది అని మీనా చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వర్య రాయ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఐశ్వర్య అందం ముందు ఎవరైనా దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now