Manushi Chhillar : రామ్‌ చరణ్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ బ్యూటీ..!

June 3, 2022 10:08 AM

Manushi Chhillar : మిస్‌ వరల్డ్‌ గా ఎంపికై చరిత్ర సృష్టించిన మానుషి చిల్లార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 2017లో ఫెమినా మిస్‌ ఇండియాగా గెలిచింది. అనంతరం భారత్‌ తరఫున మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సాధించింది. హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మెడిసిన్‌ చదువుతూనే మిస్‌ వరల్డ్‌గా ఎంపికైంది. ఇక మిస్‌ వరల్డ్‌గా ఎంపికైనప్పటికీ ఈమెకు బాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఈమె సామ్రాట్‌ పృథ్వీరాజ్ అనే మూవీలో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఈమె చిత్ర యూనిట్‌తో కలిసి పాల్గొంటోంది. ఇక పృథ్వీరాజ్‌ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు టాలీవుడ్‌లో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా.. ఠక్కున రామ్‌ చరణ్‌ అని జవాబు చెప్పింది. రామ్‌ చరణ్‌కు వివాహం అయింది కాబట్టి సరిపోయిందని.. లేకపోతే అతనితో డేటింగ్‌ చేసేదాన్నని బదులిచ్చింది. ఇక రామ్‌ చరణ్ తో ఓ మూవీలో నటించాలని అనుకుంటున్నట్లు తెలియజేసింది.

Manushi Chhillar says she would like to act with Ram Charan
Manushi Chhillar

అయితే ప్రస్తుత తరుణంలో టాలీవుడ్‌ వైపు బాలీవుడ్‌ భామలు మొగ్గుచూపుతున్నారు. టాలీవుడ్‌ సినిమాల ఖ్యాతి కూడా పెరిగింది. దీంతో తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఇతర భాషలకు చెందిన ముద్దుగుమ్మలు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే మానుషి చిల్లార్‌ కూడా తన మనసులో మాటను బయట పెట్టింది. అయితే రామ్‌ చరణ్‌ అంటే సడెన్ గా ఈమె అంత ప్రేమను ఎందుకు కురిపిస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కనుకనే అతనంటే ఆమె ఇష్టపడుతుందా.. అని చర్చించుకుంటున్నారు. ఇక చరణ్‌తో కలిసి నటించాలన్న ఈమె కోరిక నెరవేరుతుందా.. లేదా.. అన్నది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment