Manchu Vishnu : ఎంతో ఉత్కంఠ నడుమ మా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులలో ఎవరు గెలుస్తారు.. అనే దానిపై అందరిలో టెన్షన్ ఉండింది. కొద్ది సేపటి క్రితం రిజల్ట్ రాగా.. మంచు విష్ణు నాలుగు వందలకు పైగా ఓట్లతో ప్రకాశ్ రాజ్‌పై గెలుపొందినట్టు సమాచారం. కొద్ది నిమిషాలలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. ఈసీ మెంబర్స్‌గా అనసూయ, శివా రెడ్డి, కౌశిక్ గెలిచారు. ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై.. 32 ఓట్ల తేడాతో.. శివబాలాజీ గెలిచారు. జీవిత రాజశేఖర్ పై రఘుబాబు 7 ఓట్ల తేడాతో గెలిచి జనరల్ సెక్రటరీగా పొజిషన్ ఖాయం చేసుకున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మోహన్ బాబు వేసిన పాచికలు బాగానే పని చేశాయి. మొత్తం మీద మా పీఠంపై మంచు వారబ్బాయి కూర్చోనున్న నేపథ్యంలో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…