గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Manchu Vishnu : భారీ మెజారిటీతో మంచు విష్ణు గెలుపు.. కంచు మోగించిన మంచు వార‌బ్బాయి..!

Manchu Vishnu : ఎంతో ఉత్కంఠ న‌డుమ మా ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రిగింది. ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణుల‌లో ఎవ‌రు గెలుస్తారు.. అనే దానిపై అందరిలో టెన్ష‌న్ ఉండింది. కొద్ది సేప‌టి క్రితం రిజ‌ల్ట్ రాగా.. మంచు విష్ణు…

Manchu Vishnu : భారీ మెజారిటీతో మంచు విష్ణు గెలుపు.. కంచు మోగించిన మంచు వార‌బ్బాయి..!

Manchu Vishnu : ఎంతో ఉత్కంఠ న‌డుమ మా ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రిగింది. ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణుల‌లో ఎవ‌రు గెలుస్తారు.. అనే దానిపై అందరిలో టెన్ష‌న్ ఉండింది. కొద్ది సేప‌టి క్రితం రిజ‌ల్ట్ రాగా.. మంచు విష్ణు నాలుగు వంద‌ల‌కు పైగా ఓట్ల‌తో ప్ర‌కాశ్ రాజ్‌పై గెలుపొందిన‌ట్టు స‌మాచారం. కొద్ది నిమిషాల‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు.

Manchu Vishnu won as maa president

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌లో శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. ఈసీ మెంబ‌ర్స్‌గా అన‌సూయ‌, శివా రెడ్డి, కౌశిక్ గెలిచారు. ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై.. 32 ఓట్ల తేడాతో.. శివబాలాజీ గెలిచారు. జీవిత రాజశేఖర్ పై రఘుబాబు 7 ఓట్ల తేడాతో  గెలిచి జనరల్ సెక్రటరీగా పొజిషన్ ఖాయం చేసుకున్నారు.

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మోహ‌న్ బాబు వేసిన పాచిక‌లు బాగానే ప‌ని చేశాయి. మొత్తం మీద మా పీఠంపై మంచు వార‌బ్బాయి కూర్చోనున్న నేప‌థ్యంలో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి