Manchu Vishnu : శివ శంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

November 27, 2021 1:40 PM

Manchu Vishnu : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా కారణం వల్ల ఆసుపత్రి పాలైన సంగతి మనకు తెలిసిందే. ఈయనకు అధిక ఇన్ఫెక్షన్ కావడం చేత అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుండడం వల్ల ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని తన చిన్న కుమారుడు అజయ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు.. పలువురు ప్రముఖులు.

Manchu Vishnu : శివ శంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన మా అధ్యక్షుడు మంచు విష్ణు
Manchu Vishnu

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మా అధ్యక్షుడు మంచు విష్ణు.. మాస్టర్‌ ఆరోగ్యంపై స్పందించారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఆయన చిన్న కుమారుడిని ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడానని విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన విష్ణు మాస్టర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంచు విష్ణు.. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment