Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజు ప్యానెల్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. పరస్పర మాటల యుద్ధం తర్వాత మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగి చివరికి మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రత్యర్థులపై గట్టి పోటీగా నిలబడి ప్రెస్ మీట్ పెట్టి వారికి సరైన సమాధానం చెబుతూ ఎన్నికలలో తన హవా కొనసాగించారు.
ఇలా మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న తర్వాత తన ప్లాన్ ఏమిటి అనే విషయానికి వస్తే.. మంచు విష్ణు రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. మోహన్ బాబు కోరిక మేరకు తన వారసులు రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించేవారు. ఇక విష్ణు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తాడని మా ఎన్నికలు స్పష్టం చేశాయి.
ఇక విష్ణు భార్య స్వయానా సీఎం వైఎస్ జగన్ కు కజిన్ సిస్టర్ కావడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా విష్ణుకు ఎంతో సులభతరం అవుతుందని పలువురు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రత్యర్థులకు ఏ విధమైనటువంటి పోటీ ఇవ్వాలో మా ఎన్నికల ద్వారా విష్ణు తెలుసుకున్నారు. ఇక విష్ణు, జగన్ పలు సందర్భాలలో కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ అవకాశాలను ఉపయోగించుకొని విష్ణు రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్నారు. మరి మోహన్ బాబు కోరికను విష్ణు నెరవేరుస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…