Manchu Vishnu : ‘మా’ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మంచు విష్ణు.. చిరంజీవిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

October 11, 2021 10:15 PM

Manchu Vishnu : మా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మంచు విష్ణు కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీ హిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తనను విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్నానని అన్నారు.

Manchu Vishnu comments after maa election results

రామ్‌చరణ్‌ తనకు మంచి స్నేహితుడ‌ని, తండ్రి చిరంజీవి మాటకు కట్టుబడి ‍ప్రకాశ్‌రాజ్‌కే ఓటేసి ఉంటార‌ని అన్నారు. రామ్‌చరణ్‌ స్థానంలో తాను ఉన్నా అదే చేస్తాన‌ని చెప్పారు. తన గెలుపుకు వంద శాతం తన తండ్రి మోహన్ బాబే కార‌ణ‌మ‌ని తెలిపారు. అలాగే నరేష్ కూడా త‌న‌ గెలుపుకు ఎంతో కష్టపడ్డార‌ని అన్నారు.

మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞ‌తల‌ని, త‌న‌పై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని, ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి త‌న‌కు ఓటు వేసి త‌న‌ను ఆశీర్వదించార‌ని అన్నారు. ఇక ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన వారిని కూడా త‌మ‌తో కలుపుకొని పోతామ‌ని, తామంతా ఒక్క‌టేన‌ని తెలిపారు. అయితే ప్ర‌కాష్ రాజ్, నాగ‌బాబుల రాజీనామాల‌ను ఆమోదించ‌బోన‌ని, వారితో క‌ల‌సి మాట్లాడుతాన‌ని, వారి స‌ల‌హాల‌తో ముందుకు సాగుతాన‌ని మంచు విష్ణు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now