Manchu Vishnu : మంచు విష్ణు ఫ్యామిలీ అంటే.. మొదట్నుంచీ వివాదాలకు కేరాఫ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వీరు వివాదాల్లో చిక్కుకుపోతుంటారు. తరువాత సారీ చెబుతుంటారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు లక్ష్మి.. ఈ ముగ్గురూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వీరు వరుస వివాదాల్లో కూరుకుపోయారు. దీంతో మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతిష్టను మూటగట్టుకుంది.
మంచు విష్ణు, మోహన్ బాబు ఈమధ్య సీఎం జగన్‌ను కలిసి ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు, ఇతర విషయాల్లో తామే సమస్యను పరిష్కరిస్తున్నట్లు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. గతంలో మంచు ఫ్యామిలీని మెచ్చుకున్నవారే ఈ విషయంలో తిట్టిపోశారు. అంటే.. వారు ఈ మధ్య కాలంలో ఎంతటి నెగెటివిటీని మూటగట్టుకున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సినీ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రేక్షకులు అందరూ మెగాస్టార్ చిరంజీవికే మద్దతు పలికారు.
ఇక వరుస వివాదాల్లో వారు ఇలా చిక్కుకుపోతుండడంతో మొన్నీ మధ్యే విడుదలైన మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మోహన్‌బాబు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉండేది. కానీ ఆయన కెరీర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తం సినిమాకు రూ.35 లక్షలే వచ్చాయంటే వారిపై ప్రేక్షకులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది.
ఇక ఇది చాలదన్నట్లు తన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై మంచు విష్ణు ఫిర్యాదు చేయడం.. నాగశ్రీను బయటకు వచ్చి మంచు ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేయడంతో.. మరోసారి మంచు ఫ్యామిలీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఫ్యామిలీనే తేడా.. అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా.. వారు మాత్రం ఈ వివాదంపై అస్సలు ఇంకా స్పందించలేదు. వారు ఇలాగే వ్యవహరిస్తే.. ఉన్న ఆ కాస్త పేరు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా మంచు ఫ్యామిలీ మేల్కొంటుందో.. లేదో.. చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…