Tenkaya : కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు అది కుళ్లిపోయి ఉంటే ఏం చేయాలి ?

Tenkaya : ఇంట్లో పూజ చేస్తే.. లేదా దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా స‌రే పూజ అనంత‌రం కొబ్బరికాయ‌ను కొట్టి దైవానికి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. మనం చేసే ప‌నుల్లో ఎలాంటి అవ‌రోధాలు ఎదురు కాకుండా ఉండాల‌న్నా.. మ‌న‌పై ఉండే దృష్టి ప‌టాపంచ‌లు కావాల‌న్నా.. కొబ్బ‌రికాయ కొట్టాలి. అలాగే కొబ్బ‌రికాయ‌పై ఉండే మూడు క‌ళ్లు ప‌ర‌మేశ్వ‌రుడికి ప్ర‌తిరూపం. క‌నుక మ‌న‌లో ఉండే అహం పోవాలంటే కొబ్బ‌రికాయ కొట్టాలి.

Tenkaya

కానీ కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు అందులో పువ్వు వ‌స్తే అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ని.. కుళ్లిపోతే ఏదో కీడు జ‌రుగుతుంద‌ని భావిస్తారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? దీనిపై పండితులు ఏమంటున్నారు ? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దైవానికి కొట్టే కొబ్బ‌రికాయ‌ను ముందుగా శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత కాయ‌ను కొట్టి ప‌గ‌ల‌గానే వెంట‌నే విడ‌దీసి నీళ్ల‌ను ప‌ట్టాలి. అనంత‌రం ఒక్కో ముక్క‌ను దైవానికి ఇరువైపులా పెట్టి నివేదించాలి. ఆ త‌రువాత కొబ్బ‌రినీళ్ల‌ను నైవేద్యంగా పెట్టాలి.

అయితే కొబ్బ‌రికాయ‌ను కొట్టిన‌ప్పుడు పువ్వు వ‌స్తే శుభం జ‌రుగుతుంద‌ని, అది కుళ్లి పోయి ఉంటే కీడు జ‌రుగుతుంద‌ని అనుకోకూడ‌దు. ఎందుకంటే కాయలో పువ్వు ఉందా, కుళ్లిపోయిందా, అందులో నీళ్లు ఉన్నాయా.. లేదా.. అనే విష‌యం మ‌న‌కు తెలియ‌దు క‌దా.. క‌నుక అందులో ఏం వ‌చ్చినా దాన్ని మ‌న జీవితానికి ఆపాదించుకోవాల్సిన ప‌నిలేదు. కాయ‌లో పువ్వు వ‌స్తే ఓకే. లేదా అందులో కుళ్లిపోయి ఉంటే ఆ ముక్క‌ల‌ను ప‌డేసి మళ్లీ చేతులు, కాళ్లు శుభ్రంగా క‌డుక్కుని ఇంకో టెంకాయ కొట్టాలి.

ఇక కొబ్బరికాయ మ‌ధ్య‌లోకి ప‌గిలేలా చూసుకోవాలి. దీంతో మ‌న‌కు శుభం క‌లుగుతుంద‌ని భావించ‌వ‌చ్చు. వీలైనంత వ‌ర‌కు కాయ స‌రిగ్గా ప‌గిలేలా చూడాలి. వంక‌ర టింక‌ర‌గా కాకుండా గుండ్రంగా ప‌గిలేలా కాయ‌ను కొడితే శుభం క‌లుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సూర్య ఇన్నింగ్స్‌కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్‌పై ప్రశంసల జల్లు!

భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆడిన మ్యాచ్‌…

Sunday, 8 February 2026, 10:15 PM

రేవంత్ రెడ్డి బీజేపీ ‘ట్రోజన్ హార్స్’.. నిజామాబాద్‌లో కేటీఆర్ నిప్పులు!

నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్…

Sunday, 8 February 2026, 8:02 PM

వీరు బొప్పాయి పండ్లు తినకూడదు.. నిపుణుల హెచ్చరిక!

విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే ప‌పైన్ ఎంజైమ్‌తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…

Sunday, 8 February 2026, 6:55 PM

రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు! అల్లు అర్జున్ సంచలన నిర్ణయం..

భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…

Sunday, 8 February 2026, 5:07 PM

రూ.449కే జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకే బిల్లుపై 4 సిమ్‌లు, అన్‌లిమిటెడ్ డేటా!

టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్‌కు అనుకూలమైన కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…

Sunday, 8 February 2026, 2:44 PM

జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ సెన్సేషన్.. తొలి భారతీయ నటుడిగా సరికొత్త రికార్డ్!

2023లో జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్‌పై రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…

Sunday, 8 February 2026, 12:46 PM

ఐఓసీఎల్ పానిపట్ రిఫైనరీలో 637 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…

Sunday, 8 February 2026, 10:03 AM

ఓటీటీలోనూ ప్రభాస్ ‘రాజాసాబ్’ ఫెయిల్.. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్!

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిధి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ది రాజా సాబ్…

Saturday, 7 February 2026, 10:28 PM