Manchu Manoj : ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసిన మంచు హీరో.. కార‌ణం ఏమిట‌బ్బా..?

October 14, 2021 10:49 PM

Manchu Manoj : మా ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో అటు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌, ఇటు మంచు విష్ణు ప్యానెల్‌ల మ‌ధ్య మాట‌ల పోరు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. మంచు ఫ్యామిలీకి చెందిన హీరో ప‌వ‌న్ కల్యాణ్‌ను క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఆయ‌న‌ను గురువారం మంచు మ‌నోజ్ క‌లిశారు.

Manchu Manoj met pawan kalyan on bhimla nayak set

షూటింగ్ లొకేష‌న్‌లో ప‌వ‌న్ ను క‌లిసిన మ‌నోజ్ కాసేపు ఆయ‌న‌తో మాట్లాడారు. త‌రువాత మనోజ్ ట్వీట్ చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసినందుకు సంతోషంగా ఉంది, ఆయ‌న ద‌య‌, ప్రేమ చూపిస్తారు.. ల‌వ్ యూ మ‌చ్‌, జై హింద్‌.. అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశారు.

అయితే గురువారం మ‌ధ్యాహ్నం మోహ‌న్ బాబు, మంచు విష్ణులు బాల‌కృష్ణ‌ను ఆయ‌న నివాసంలో క‌లిశారు. మా ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు విష్ణుకు మ‌ద్ద‌తు తెలిపినందుకు గాను బాల‌కృష్ణ‌కు మోహ‌న్ బాబు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కాగా ఒకే రోజు ఇలా మంచు ఫ్యామిలీ స‌భ్యులు ఇద్ద‌రు వేర్వేరు అగ్ర హీరోల‌ను క‌ల‌వ‌డం, అందులోనూ మా ఎన్నిక‌ల వివాదాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఇలా వారు ఆ హీరోల‌ను క‌ల‌వ‌డం.. ఆస‌క్తిక‌రంగా మారింది. బాల‌కృష్ణ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు వారు ఆయ‌నను క‌లిశారని చెప్పారు. మ‌రి మ‌నోజ్ ప‌వ‌న్‌ను ఎందుకు క‌లిశాడ‌న్న‌ది ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే మారింది. ఇక మనోజ్ అహం బ్ర‌హ్మాస్మి అనే మూవీతో మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now