Manchu Lakshmi : సీనియర్ నటుడు మోహన్ బాబు నట వారసురాలిగా మంచు లక్ష్మికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా నటిగా తానేంటో నిరూపించుకుంది. కాకపోతే ఈమె మాట్లాడే యాస వల్లే ఇబ్బందుల పాలవుతుంటుంది. గతంలో ఓసారి సినిమా షూటింగ్‌లో గాయాలు అయినట్లు మేకప్ వేసుకుంటే నిజ జీవితంలోనే యాక్సిడెంట్ అయినట్లు ఫొటోలు పెట్టి అందరిలోనూ నవ్వుల పాలైంది. దీంతో నెటిజన్లు మంచు లక్ష్మిని ఏకిపారేశారు. అయితే ఇప్పుడు కూడా అలాగే నవ్వుల పాలవుతోంది.
మంచు లక్ష్మి గంగానదిలో స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అయితే ఇందులో ఆమె కాస్త ఓవర్ యాక్షన్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. పవిత్ర క్షేత్రంలో అలా ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకని అంటున్నారు. అలాగే అసలు ఈ వీడియోను షేర్ చేయకపోతే ఏంటి..? ఇలాంటి వీడియోలను కూడా షేర్ చేయాలా.. అని ఘాటుగానే విమర్శిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.
మంచు లక్ష్మి నటిగానే కాక టీవీ వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకుంది. ఈమె పలు తెలుగు షోలను హోస్ట్ చేసింది. కెరీర్ ఆరంభంలో అమెరికన్ టీవీ షోలలో నటించింది. అలాగే 2006లో చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సరోగసీ ద్వారా ఒక కుమార్తె జన్మించింది. వీరు హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అనగనగా ఓ ధీరుడు సినిమా తో అడుగుపెట్టింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మి బాంబ్ వంటి చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఈమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…