Manchu Lakshmi : మంచు ల‌క్ష్మి.. ఇంత ఓవ‌ర్ ఎందుకు.. ఆ వీడియోను కూడా షేర్ చేయాలా..?

September 12, 2022 5:01 PM

Manchu Lakshmi : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు న‌ట వార‌సురాలిగా మంచు ల‌క్ష్మికి ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. అయితే మంచు ల‌క్ష్మి ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా న‌టిగా తానేంటో నిరూపించుకుంది. కాక‌పోతే ఈమె మాట్లాడే యాస వ‌ల్లే ఇబ్బందుల పాల‌వుతుంటుంది. గ‌తంలో ఓసారి సినిమా షూటింగ్‌లో గాయాలు అయిన‌ట్లు మేక‌ప్ వేసుకుంటే నిజ జీవితంలోనే యాక్సిడెంట్ అయిన‌ట్లు ఫొటోలు పెట్టి అంద‌రిలోనూ న‌వ్వుల పాలైంది. దీంతో నెటిజ‌న్లు మంచు ల‌క్ష్మిని ఏకిపారేశారు. అయితే ఇప్పుడు కూడా అలాగే న‌వ్వుల పాల‌వుతోంది.

మంచు ల‌క్ష్మి గంగాన‌దిలో స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అయితే ఇందులో ఆమె కాస్త ఓవ‌ర్ యాక్ష‌న్ చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ప‌విత్ర క్షేత్రంలో అలా ఓవ‌ర్ యాక్షన్ చేయ‌డం ఎందుక‌ని అంటున్నారు. అలాగే అస‌లు ఈ వీడియోను షేర్ చేయ‌కపోతే ఏంటి..? ఇలాంటి వీడియోల‌ను కూడా షేర్ చేయాలా.. అని ఘాటుగానే విమ‌ర్శిస్తున్నారు. కాగా మంచు ల‌క్ష్మి ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది.

Manchu Lakshmi  being trolled by netizen again for her latest video
Manchu Lakshmi

మంచు ల‌క్ష్మి న‌టిగానే కాక టీవీ వ్యాఖ్యాత‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈమె ప‌లు తెలుగు షోల‌ను హోస్ట్ చేసింది. కెరీర్ ఆరంభంలో అమెరికన్ టీవీ షోల‌లో న‌టించింది. అలాగే 2006లో చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సరోగసీ ద్వారా ఒక కుమార్తె జన్మించింది. వీరు హైదరాబాద్‌లో జీవిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అనగనగా ఓ ధీరుడు సినిమా తో అడుగుపెట్టింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మి బాంబ్ వంటి చిత్రాల్లో నటించింది. అయిన‌ప్ప‌టికీ ఈమె న‌టించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now