Malavika Mohanan : గాయాల ఫొటోల‌ను షేర్ చేసిన హీరోయిన్.. లైక్ చేసిన 2 ల‌క్ష‌ల మంది నెటిజ‌న్స్..

November 30, 2021 1:10 PM

Malavika Mohanan : మాళ‌విక మోహ‌న‌న్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా సుప‌రిచితం. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ‘పేట’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తొలి చిత్రంలోనే ర‌జ‌నీకాంత్‌తో న‌టించే గొప్ప అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. ఆతర్వాత ‘మాస్టర్‌’ సినిమాతో మరో స్టార్‌ హీరో విజయ్‌తో జత కలిసింది.

Malavika Mohanan : గాయాల ఫొటోల‌ను షేర్ చేసిన హీరోయిన్.. లైక్ చేసిన 2 ల‌క్ష‌ల మంది నెటిజ‌న్స్..

ఇప్పుడు కోలీవుడ్‌ లో మరో స్టార్‌ హీరో ధనుష్‌ పక్కన ‘మారన్‌’లో నటిస్తోంది. దీంతోపాటు రవి ఉడయార్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’లో మాళవికా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది మాళవిక.

చేతికి, కాలికి తగిలిన దెబ్బ‌ల‌ను షేర్ చేస్తూ.. యాక్ష‌న్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్న‌ప్పుడు ఇలాంటి గాయాలు త‌గులుతుండ‌డం కామ‌న్ అని పేర్కొంది. ఆమె షేర్ చేసిన పోస్ట్‌ ని దాదాపుగా 2 లక్షల మందికి పైగా లైక్‌ చేయడం గమనార్హం. మాళ‌విక తమిళం, మలయాళంతోపాటు కొన్ని రోజుల క్రితం హిందీలో విడుదలైన వెబ్‌సిరీస్‌ ‘మసాబా మసాబా’లోనూ ఓ చిన్న పాత్రలో నటించింది . సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత ఓ రేంజ్ లో ఉంటుంది.

https://www.instagram.com/p/CWzmJ0CqGBm/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment