Maheshwari : అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పెళ్లి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1994వ సంవత్సరంలో అమ్మాయి కాపురం అనే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెళ్లి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచి మహేశ్వరికి సినిమాలపై మక్కువ ఉండడంతో ఆమె కాలేజీలో చదివే సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొంతకాలం పని చేసింది.
ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా తమిళ్ భాషలో కార్తుతమ్మ అనే చిత్రంలో నటించింది. 2008లో జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక సినిమాలు చేయడం మానేసింది. మహేశ్వరి హీరోయిన్ గా నటించిన సినిమాల్లో గులాబీ సినిమా ఒకటి. అయితే ఇటీవల మహేశ్వరి ఆలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా గులాబీ సినిమా విశేషాలు చెబుతూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పింది. ఆ పాట షూటింగ్ కు ముందు తానెప్పుడూ బైక్ ఎక్కలేదని చెప్పింది.
అంతేకాదు ఈ సాంగ్ లో బైక్ పై చాలా వేగంగా వెళ్లాలని జేడీ చక్రవర్తితో దర్శకుడు కృష్ణవంశీ చెప్పారని తెలిపింది. దాంతో తనకు మరింత భయం పెరిగిందని జేడీ చాలా స్పీడ్ గా బైక్ నడిపాడని పేర్కొంది. దీంతో పాట షూటింగ్ చేసిన సందర్భంలో బైక్ స్కిడ్ అయిందని మహేశ్వరి తెలిపింది. దాంతో బైక్ ఒక్కసారి కాలువలోకి వెళ్లి పడిపోయిందని కాసేపు తనకు ఏమీ అర్థం కాలేదని, అయితే అందులో ఒక చెట్టు ఉండడం వల్ల బతికి బయటపడ్డామని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు బైక్ ను వెనక్కి లాగారని అలా ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది. గులాబీ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…