Maheshwari : గులాబీ మూవీ పాట‌లో బైక్ మీద వెళ్లిన‌ప్పుడు యాక్సిడెంట్ అయింది.. అప్పుడు ఏమైందంటే..?

September 24, 2022 1:12 PM

Maheshwari : అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పెళ్లి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1994వ సంవత్సరంలో అమ్మాయి కాపురం అనే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెళ్లి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచి మహేశ్వరికి సినిమాలపై మక్కువ ఉండడంతో ఆమె కాలేజీలో చదివే సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కొంతకాలం పని చేసింది.

ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా తమిళ్ భాషలో కార్తుతమ్మ అనే చిత్రంలో నటించింది. 2008లో జ‌య‌కృష్ణ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాక సినిమాలు చేయడం మానేసింది. మహేశ్వరి హీరోయిన్ గా నటించిన సినిమాల్లో గులాబీ సినిమా ఒకటి. అయితే ఇటీవల మహేశ్వరి ఆలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా గులాబీ సినిమా విశేషాలు చెబుతూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పింది. ఆ పాట షూటింగ్ కు ముందు తానెప్పుడూ బైక్ ఎక్కలేదని చెప్పింది.

Maheshwari told what happened gulabi movie bike song
Maheshwari

అంతేకాదు ఈ సాంగ్ లో బైక్ పై చాలా వేగంగా వెళ్లాలని జేడీ చక్రవర్తితో దర్శకుడు కృష్ణవంశీ చెప్పారని తెలిపింది. దాంతో తనకు మరింత భయం పెరిగిందని జేడీ  చాలా స్పీడ్ గా బైక్ నడిపాడని పేర్కొంది. దీంతో పాట షూటింగ్ చేసిన సందర్భంలో బైక్ స్కిడ్ అయిందని మహేశ్వరి తెలిపింది. దాంతో బైక్ ఒక్కసారి కాలువలోకి వెళ్లి పడిపోయిందని కాసేపు తనకు ఏమీ అర్థం కాలేదని, అయితే అందులో ఒక చెట్టు ఉండడం వల్ల బతికి బయటపడ్డామని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు బైక్ ను వెనక్కి లాగారని అలా ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది. గులాబీ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now